లక్ష్మీదేవరకు బోనమెత్తిన భక్త జనం
కాళేశ్వరం: కాళేశ్వరంలో లక్ష్మీదేవర కిష్టస్వామి కల్యాణం భక్తిశ్రద్ధలతో నాయకపోడ్ పూజారుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం కల్యాణం, బోనాల సందర్భంగా మహిళా భక్తులు బోనమెత్తారు. ఆలయం చుట్టూర డప్పు చప్పుళ్లు, శివసత్తుల ఆటపాటలు, పూనకాలతో జయజయ ధ్వానాలతో మార్మోగింది. లక్ష్మీదేవరకు పట్నంతో బోనం సమర్పించి ప్రత్యేకంగా పూజలు, మొక్కులు చెల్లించారు. దీంతో భారీగా భక్తజనం తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో పూజారులు ఇనుముల వెంకటేష్, ఇనుముల రాకేష్, పోలం లస్మయ్య, ఇనుముల రాములు, ఇనుముల కిష్టయ్య, కిరణ్ పాల్గొన్నారు.
లక్ష్మీదేవరకు బోనమెత్తిన భక్త జనం


