4.30 ఎకరాలు.. 2,732 మొక్కలు
గతంలో కంటే భిన్నంగా
ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉద్యాన పంటల సాగు
ఏటూరునాగారం: ఏడేళ్లుగా పడావుపడిన భూమిని ఐటీడీఏ అధికారులు సాగులోకి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆ భూమి అసాంఘిక శక్తులకు, అక్రమార్కులకు అడ్డాగా మారింది. ఈ క్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా స్పందించి ఏటూరునాగా రం మండల కేంద్రంలోని ఉద్యాన నర్సరీ(గార్డెన్) స్థలంలో పండ్లు, పూల మొక్కల సాగుకు శ్రీకారం చుట్టారు. ఐటీడీఏ ద్వారా బడ్జెట్‌ను కేటాయించి నర్సరీలో బోరు నిర్మాణ చేపట్టారు. అదే విధంగా రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాంతాల నుంచి అనేక రకాల మొక్కలను తెప్పించారు.
అనునిత్యం మొక్కల పర్యవేక్షణ
ఐటీడీఏకు చెందిన 4.30 ఎకరాల్లో గార్డెన్‌లో 2 వేల మల్లె మొక్కలు, 116 నిమ్మ, 116 సపోట, 250 టేకు మొక్కలను ఇటీవల ఐటీడీఏ ఏపీఓ వసంతరావు చేతుల మీదుగా మొక్కలను నాటించే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే 250 కొబ్బరి మొక్కలు నాటే పనులతో పాటు డ్రిప్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మొక్కలను పెంచేందుకు ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేశారు. నిత్యం పర్యవేక్షణతో పాటు దిగుబడి వచ్చిన తర్వాత మార్కెట్, హాస్టళ్లలో సరఫరా చేసే విధంగా పక్కా ప్లాన్ చేశారు. వీటికి ఖర్చును ఐటీడీఏ ద్వారా బడ్జెట్ కేటాయించారు. అలాగే వెదురు మొక్కలను మాత్రం ఉపాధి హామీ పథకం ద్వారా నాటించేలా చర్యలు తీసుకున్నారు. వెదురు మొక్కల సాగు వల్ల వచ్చే ఆర్థిక ఫలాలను ఐటీడీఏకు అందజేయనున్నారు. ఇప్పటికే మల్లె, సపోట, టేకు, నిమ్మ మొక్కలు నాటే పనులు పూర్తయ్యాయి. వెదురు ప్లాంటేషన్ పనులు సాగుతున్నాయి. రెండేళ్లలోపు దిగుబడి తీసి ఫలాలను హాస్టళ్లకు సరఫరా చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు.
గతంలో గిరిజనులకు ఈ స్థలాన్ని లీజ్‌కు ఇచ్చి కూరగాయల పంటలను దిగుబడి చేసి ఆర్థిక ఫలాలు వచ్చేవిధంగా చేశారు. అయితే ఆ సమయంలో ఏడాది పాటు సాగు జరిగింది. తర్వాత లాభాలు రావడం లేదని గిరిజన మహిళా సంఘం ఉపసంహరించుకున్నారు. దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భూమిలో ఎలాంటి సాగు జరగలేదు. అనేక మార్లు సాక్షి కథనాలు ప్రచురించింది. పడావుపడిన భూముల్లో అసాంఘిక శక్తులు, భూమి కబ్జా విషయాలపై అధికారులకు కళ్లు తెరిచేలా కథనాలు రావడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించి స్వయంగా పంటల సాగుకు చర్యలు చేపట్టారు.
పీఓ చిత్రామిశ్రా చొరవతో
సాగులోకి భూమి
బడ్జెట్ కేటాయింపు.. బోరు నిర్మాణం
4.30 ఎకరాలు.. 2,732 మొక్కలు
4.30 ఎకరాలు.. 2,732 మొక్కలు


