ఘనంగా వడ్డె ఓబన్న జయంతి
ములుగు రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించగా వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఓబన్న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. సాయుధ పోరాట సైనాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ప్రభుత్వం ఓబన్నకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దండుగుల మల్లయ్య, సారంగపాణి, నర్సయ్య, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘నాయీబ్రాహ్మణులకు గుర్తింపు కార్డులివ్వాలి’
ములుగు రూరల్: మేడారం జాతరలో నాయీబ్రాహ్మణులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కల్యాణ కట్టల అధ్యక్షుడు అన్నం మోహన్‌కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతరలో నాయీబ్రాహ్మణులకు న్యాయం జరిగేలా చూ డాలన్నారు. వృత్తిదారులు ఆధార్, కుల ధ్రువీ కరణ సర్టిఫికెట్ల ఆధారంగా గుర్తించి ఉచిత వసతి, భోజనం సౌకర్యం కల్పించాలన్నారు. జాతర ఆదాయంలో ఎక్కువశాతం కేశఖండన ద్వారానే సమకూరుతుందని తలనీలాలతో వచ్చే ఆదాయంలో నాయీబ్రాహ్మణులకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతర ట్రస్టు బోర్డులో సైతం అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.
రేగొండ: మండలంలోని కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా నేడు (సోమవారం) స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మహేష్, చైర్మన్ ముల్కనూరి భిక్షపతి తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 19న సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగే దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలో నిర్వహించిన జీపు జాతలో పాల్గొని మాట్లాడారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, సకల జనులను చైతన్యం చేయడం కోసం జీపు జాత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మిక నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బందు సాయిలు, నాయకులు రజినీకాంత్, శ్రీకాంత్, దేవేందర్, ప్రీతి, నవీన్, క్రాంతి, రవికమార్, రాజేందర్ పాల్గొన్నారు.
ఘనంగా వడ్డె ఓబన్న జయంతి


