ప్రగతిపథాన నిలుపుతాం..
యువత సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను. నేను బీఎస్సీ చదవాను. రాజకీయాల్లోకి వచ్చి గ్రామాన్ని బాగు చేయాలనే ఆలోచనతో వచ్చి సర్పంచ్ అయ్యాను. గ్రామంలోని యువతరం సహకారం తీసుకుని ప్రజల సమస్యలను పరిష్కరిస్తాను. రోడ్లు, తాగునీరు, విద్య, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాను. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూస్తాను.
– బోదెబోయిన భరత్ కుమార్,
గుమ్మడి దొడ్డి గ్రామ సర్పంచ్
నేను ఇంటర్మీడియట్ చదివాను.26ఏళ్లకే సర్పంచ్ అయ్యాను. గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకున్నాను. తొలుత గ్రామంలోని ప్రధాన సమస్యలపై దృషిసారించి ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్లాన్‌తో ముందుకు వెళ్తాను. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటున్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గ్రామాభివృద్ధికి పాటుపడుతాను.
– రాందేని నర్సింహామూర్తి రాజు, షాపెల్లి సర్పంచ్
ప్రగతిపథాన నిలుపుతాం..
ప్రగతిపథాన నిలుపుతాం..


