హేమాచలక్షేత్రంలో సండే సందడి
ప్రత్యేక అలంకరణలో హేమాచలుడు, స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుంటున్న భక్తులు
మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో పాటు తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు.
హేమాచలక్షేత్రంలో సండే సందడి


