పుస్తకావిష్కరణ
ఎస్‌ఎస్‌తాడ్వాయి: సమ్మక్క –దీ గ్లోరీ ఆఫ్ మేడారం పుస్తకాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క ఆవిష్కరించారు. సమాచార పౌర సంబంధాలశాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెంటి వెంకటరమణ రచించిన పుస్తకాన్ని మేడారంలో మంత్రి సీతక్క కలెక్టర్ దివాకరతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం జాతర విశిష్టతను ఆదివాసీ సంస్కృతి– సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ పుస్తకాన్ని రూపొందించారని సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, డీపీఆర్వో రఫీక్ పాల్గొన్నారు.
చిన్నారి తల్లిదండ్రులకు అప్పగింత
అదే విధంగా మేడారంలో జాతర ఏర్పాట్లను మంత్రి పర్యవేక్షిస్తున్న సమయంలో ఓ చిన్నారి తప్పిపోయిన విషయాన్ని సీతక్క గమనించారు. వెంటనే అధికారులు ఆ చిన్నారి వివరాలు సేకరించి తల్లిదండ్రులను గుర్తించగా వారికి అప్పగించారు. జాతరలో చిన్నపిల్లలను జాగ్రతగా చూసుకోవాలని మంత్రి సీతక్క తల్లిదండ్రులకు సూచించారు. మేడారంలో భక్తులు, పిల్లలు తప్పిపోతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.


