సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
వెంకటాపురం(ఎం): ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతర ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో మేడారం తరలివచ్చి సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోత్ రవిచందర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పీవీ కన్వెన్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మండలం నుంచి ప్రతీ కార్యకర్త హాజరయ్యేలా సంబంధిత నాయకులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి అయిలయ్య, పంచాయతీ రాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్‌రెడ్డి, నాయకులు బండి శ్రీనివాస్, పోశాలు, రేవంత్, కోటి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్


