వనదేవతలకు మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలో కొలువైన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జంపన్న వాగులో షవర్ల కింద స్నానాలు ఆచరించి, వనదేవతల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు మేడారం అటవీ ప్రాంతంలో చెట్ల కింద వంటావార్పు చేసుకుని కుటుంబ సమేతంగా భోజనలు చేశారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు.


