వామ్మో డేంజర్..
మల్హర్ మండలం కొయ్యూరు నాగులమ్మ సమీపంలో బొగ్గుల వాగు వంతెన ప్రమాదకరంగా ఉంది. వంతెన సైడ్ వాల్‌ను గతంలో లారీ ఢీకొట్టడంతో వాల్ సగభాగం కూలిపోయింది. వంతెన మీదుగా మంథని–కాటారం ప్రాంతాలకు నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 28న నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో రద్దీ పెరగనుంది. జిల్లా అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న వంతెనకు సైడ్ వాల్ నిర్మించాలని పలువురు కోరుతున్నారు. – మల్హర్


