భక్తులకు ఇబ్బంది కలగొద్దు | - | Sakshi
Sakshi News home page

భక్తులకు ఇబ్బంది కలగొద్దు

Jan 11 2026 9:39 AM | Updated on Jan 11 2026 9:39 AM

భక్తులకు ఇబ్బంది కలగొద్దు

భక్తులకు ఇబ్బంది కలగొద్దు

మంత్రి సీతక్క

ములుగు రూరల్‌ : మేడారం మహాజాతరకు రానున్న భక్తులకు రవాణా అంతరాయం కలగకుండా బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. శనివారం మల్లంపల్లి కెనాల్‌పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మేడారం జాతకు వచ్చే భక్తులకు మల్లంపల్లి బ్రిడ్జి అత్యంత కీలకమని, జాతర ప్రారంభానికి ముందే బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చూసుకో వాలని, తాత్కాలిక రోడ్డు, భద్రత ఏర్పాట్లు చే యాలని వివరించారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్స న్‌ రేగ కల్యాణి, ఆత్మ చైర్మన్‌ కొండం రవీంద ర్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

జాతర ఏర్పాట్ల పర్యవేక్షణ

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో మహాజాతర ఏర్పాట్లను మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. శనివారం రాత్రి వరకు జాతర పనుల పురోగతిని సమీక్షించారు. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ అధికారులు, పోలీసు సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి శాఖల మధ్య సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. జాతర విధుల్లో ఉన్న పోలీసులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆమె సూచించారు. కలెక్టర్‌ దివాకర్‌ టీఎస్‌, ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, పీఓ చిత్రామిశ్రా ఉన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించాలి

ములుగు: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. 20 వార్డులను గెలిచి ములుగు గడ్డపై కాంగ్రెస్‌ జెండాను ఎగుర వేయాలన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌ అధ్యక్షతన ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించగా సీతక్క హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు కష్టపడిన ప్రతీ కార్యకర్తకి పార్టీ పరంగా గుర్తింపు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మేడారం పర్యటనను జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి సీఎం విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, పీసీసీ కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, నాయకులు గొల్లపల్లి రాజేందర్‌ గౌడ్‌, భగవాన్‌ రెడ్డి, వంగ రవియాదవ్‌, మామిడిశెట్టి కోటి, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement