భక్తులతో రామప్ప కళకళ
వెంకటాపురం(ఎం) : మేడారం భక్తులతో రామప్ప ఆలయం కళకళ లాడుతోంది. సమ్మక్క–సారలమ్మల దర్శనానికి వెళ్లే భక్తులు రామప్ప ఆలయాన్ని చూసేందుకు వస్తుండడంతో రామప్ప కిక్కిరిసిపోతుంది. దీంతో పూజారులు గర్భగుడిలోకి భక్తులను అనుమతించకుండా ప్రదానం ద్వారం వద్దనే తీర్థప్రసాదాలు అందించి పంపిస్తున్నారు. వీకెండ్ కావడంతో శనివారం వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. రామప్ప గార్డెన్‌లో ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. రామప్ప సరస్సు వద్దకు వెళ్లి బోటింగ్ చేశారు.
రామప్పను సందర్శించిన
మహబూబాబాద్ జిల్లా జడ్జి
మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని మహబూబాబాద్ జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ కుటుంబ సమేతంగా శనివారం సందర్శించారు. రామప్ప శిల్పకళా సంపదను గైడ్ వెంకటేష్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. శిల్పకళా సంపద బాగుందని కొనియాడారు.
భక్తులతో రామప్ప కళకళ


