జిల్లా ఏర్పాటులో బీజేపీ క్రియాశీలక పాత్ర
ములుగు రూరల్: ములుగు జిల్లా ఏర్పాటు కోసం శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ క్రియాశీలక పాత్ర పోషించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన త్వర్వాత తొలిసారిగా ఆయన శుక్రవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరామ్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. గట్టమ్మ ఆలయం వద్ద గజమాలతో సత్కరించారు. అనంతరం గట్టమ్మ ఆలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గం వెనుక బడిన ప్రాంతం ఇక్కడి విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ములుగు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వీరేందర్, గౌతం రావు, వాసుదేవరావు, నరేష్, చింతలపూడి భాస్కర్ రెడ్డి, రాజు నాయక్, జవహర్ లాల్, గుగులోతు స్వరూప, రవీంద్రచారి, జాడి వెంకట్, రమేష్ తదితరులు ఉన్నారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు


