భక్తుల రద్దీ పర్యవేక్షణకు నిఘానేత్రాలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతరలో నిఘానేత్రాల ద్వారా భక్తుల రద్దీని పర్యవేక్షించనున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. మేడారం జాతరలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పని తీరును మేడారంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి శుక్రవారం ఎస్పీ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణకు ఎలాంటి అనూహ్య సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సీసీటీవీ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. జాతర సమయంలో భారీ రద్దీ ఉన్న ప్రధాన ప్రాంతాలైన జంపన్నవాగు, అమ్మవార్ల గద్దెలు, హరిత వై జంక్షన్, ట్రాఫిక్ మార్గాలు, కూడళ్ల రద్దీ, కోర్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి నేపథ్యంలో ఈసారి గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భద్రతను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.


