మేడారం భక్తులకు గాయాలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: పత్తి లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొట్టడంతో మేడారానికి వస్తున్న భక్తులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాలకు చెందిన భక్తులు టాటా మ్యాజిక్ వాహనంలో మేడారానికి వస్తున్నారు. అదేసమయంలో కాల్వపల్లి నుంచి పత్తి లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం వీరి వాహనాన్ని మండలంలోని కాల్వపల్లి శివారులో ఢీకొట్టింది. దీంతో మంచిర్యాలకు చెందిన పోసక్క, రాజలక్ష్మి, రోజా తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురిని 108 అంబులెన్స్‌లో ఎంఈటీ నద్దునూరి మధు, పైలెట్ అరె కరుణాకర్ ప్రథమ చికిత్స నిర్వహించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో టాటా మ్యాజిక్ నుజ్జునుజ్జయింది. మరో 12 మంది భక్తులకు ఎలాంటి ప్ర మాదం జరగకపోవడంతో ఊపిరిపిల్చుకున్నారు.
కాల్వపల్లి దాటిన తర్వాత ప్రమాదం


