నిట్‌లో సీఈటీఎస్‌బీ–26 జాతీయ సదస్సు
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో సీఈటీఎస్‌బీ–26 (ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ స్టక్చరల్ బయోఫిజిక్స్)పై మూ డు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నిట్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో శుక్రవారం నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. భారత ప్రభుత్వం బయోటెక్నాలజీ విభాగంలో నూతన ఆవిష్కరణలకు పరిశోధనలకుగాను అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఎస్‌ఐఆర్ మాజీ డీజీ, ప్రొఫెసర్ శేఖర్.సీ.మండే, బయోటెక్నాలజీ విభాగం హెడ్, ప్రొఫెసర్ బి.రామరాజు, ప్రొఫెసర్లు రాజన్ శంకర్‌నారాయణన్, కిరణ్‌కుమార్, సౌమ్య లిప్సా పాల్గొన్నారు.


