రామప్పలో భక్తుల సందడి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, విద్యార్థులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా ఆలయ విశిష్టత గురించి గైడ్‌లు పర్యాటకులకు వివరించారు. అనంతరం రామప్ప సరస్సు కట్టకు చేరుకొని సరస్సులో బోట్ షికారు చేశారు.
ములుగు రూరల్: క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. మండలంలోని కొత్తూరు దేవునిగుట్ట ఆవరణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను శుక్రవారం ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి కనబరచాలని అన్నారు. కొత్తూరు–పత్తి పల్లి మ్యాచ్ ప్రాంభించారు. పత్తిపల్లి టీం గెలుపొందగా అభినందించారు. కార్యక్రమంలో పత్తిపల్లి ఉప సర్పంచ్ పోరిక భద్రు నాయక్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
వాజేడు: అడవుల మూలంగా మానవాళికి ఎంతో మేలు జరుగుతుందని దానిని కాపాడుకుందామని ఎఫ్‌ఎస్‌ఓ నారాయణ అన్నారు. మండల పరిధిలోని చెరుకూరు గ్రామంలో శుక్రవారం జిల్లా అటవీ శాఖాధికారి రాహుల్ కిషన్ జాదవ్ ఆదేశాల మేరకు యువకులకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారికి సర్పంచ్ వాసం రాజబాబు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం యువతీ యువకులకు అడవిలో నిప్పు మూలంగా జరిగే కష్ట, నష్టాలను వివరించారు. కార్యక్రమంలో పద్మ, మనీష, జనార్ధన్, దామోదర్ ఉన్నారు.
గణపేశ్వరుడికి
లక్ష్మీవారం పూజలు
భూపాలపల్లి: కాకతీయుల కళావైభవం గణపు రం కోటగుళ్లలో గణపేశ్వరుడికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీవారం కావడంతో భక్తులు అధికసంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ, విభూతి, గంధంతో గణపేశ్వరుడిని అలంకరించారు. భక్తులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు.
రామప్పలో భక్తుల సందడి
రామప్పలో భక్తుల సందడి
రామప్పలో భక్తుల సందడి


