తరలివచ్చి మొక్కులు తీర్చి..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం వేల సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవార్ల గద్దెల వద్ద భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లో వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. భక్తుల రద్దీని పోలీసు అధికారులు పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా.. మేడారంలో తల్లుల దర్శనానికి తరలివస్తున్న భక్తులు మొక్కుల చెల్లింపులో భాగంగా సంప్రదాయ ప్రకారం ఎదురకోడిని ఎగిరేస్తున్నారు. కోడిని ఒకసారి ఎగరేయడానికి కోడి యజమానులు రూ.10 తీసుకుంటున్నారు. ఈ ఎదురుకోళ్లను ఎగరేసేవిధానం చాలాఏళ్లుగా కొనసాగుతోంది.
తరలివచ్చి మొక్కులు తీర్చి..


