జాతరను విజయవంతం చేయాలి
మల్హర్(కాటారం): మండలంలోని జాదరావుపేటలో ఈ నెల 11 నుంచి 12 వరకు జరిగే నాయక పోడుల ఆరాధ్య దైవం లక్ష్మీదేవర బోనాల జాతరను వియవంతం చేయాలని నాయకపోడు యువత కోరారు. శుక్రవారం జాతరకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కోర్కెల తీర్చే కొంగుబంగారం లక్ష్మిదేవర బోనాల జాతర మహోత్సవా లను జాదరావుపేట గ్రామ పంచాయతీలో నాయకపోడ్‌ల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కోట అశోక్, బద్ది వెంకటేష్, పెరుమాండ్ల రాజేందర్, గుంటి రాహుల్, చింతకుంట్ల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


