విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
చిట్యాల : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను, విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని భూపాలపల్లి రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రైతు సంఘం జీపుజాతా మండల కేంద్రానికి చేరుకుంది. దీంతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 11 వరకు జిల్లాలోని 10 మండలాలు 343 గ్రామాల 302 కిలోమీటర్ల వరకు జీపుజాతా తిరుగుతుందన్నారు. ఈ నెల 19న జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు పాల్గొన్నారు.


