పాఠశాలల్లో సంక్రాంతి సంబురాలు
గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి మోడల్ స్కూల్‌లో శుక్రవారం సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థుల కోసం ము గ్గుల పోటీలు, పతంగుల ఫెస్టివల్‌ను ప్రిన్సిపాల్ గండు కుమార్ ఏర్పాటు చేయగా, స్కూల్ ఆవరణ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థినిలు రంగురంగుల ముగ్గులు వేసి పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే విధంగా రూపొందించిన ముగ్గులు అందరి మనసుకు ఆకట్టుకున్నాయి. మరో వైపు అబ్బాయిలు స్వయంగా తయారు చేసుకున్న పతంగులతో పతంగుల ఎగురవేత పోటీలో ఆనందంగా పాల్గొని సంక్రాంతి సందడిని రెట్టింపు చేశారు. ముగ్గుల పోటీలను ఉపాధ్యాయులు పరిశీలించి అత్యుత్తమ ముగ్గులు వేసిన విద్యార్థులను ఎంపిక చేసి బహుమతులు ప్రకటించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
వెంకటాపురం(కె) : మండల కేంద్రంలోని విజన్ స్కూల్‌లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. శనివారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఆనంతరం స్కూల్ ఆవరణలో భోగి మంటలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్కూల్ ఇన్‌చార్జ్ రామారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీలను సర్పంచ్ తాటి సరస్వతి, ఉప సర్పంచ్ సన్నిలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు బోల్లే శ్రీనివాస్, జయరాం, రమాదేవి, భిక్షమణి, పుష్పావతి తదితరులు ఉన్నారు.
ఏటూరూనాగారం : మండల పరిధిలోని కొమరం భీం ఎంపీపీఎస్‌లో సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు శుక్రవారం నిర్వహించారు. పోటీల్లో గెలుపోందిన విద్యార్ధులకు బహుమతులను అందజేశారు. పాఠశాల హెచ్‌ఎం గుమ్మల రవిందర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వాజేడు : స్థానిక ఎంపీపీఎస్‌లో శుక్రవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్ధులకు, తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి మండల విద్యాశాఖాధికారి తేజావత్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు.
మంగపేట: మండల కేంద్రంలోని శ్రీ వైష్నవి ప్రైవేటు పాఠశాలలో ముందస్తు మకర సంక్రాంతి పండుగ సంబరాలను పాఠశాల ప్రిన్సిపాల్ రావుల రాజేశ్వర్‌రావు పర్యవేక్షణలో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యార్థులకు కలిసి సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు.
డిగ్రీ కళాశాలలో ముగ్గుల పోటీలు
ఏటూరునాగారం : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తు ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీలను మహిళా సాధికారత, కళాశాల సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలను కాలేజీ ప్రిన్సిపాల్ రేణుక ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళా సాధికారిత విభాగం కన్వీనర్ పాతిమా, కళాశాల సాంస్కృతిక విభాగం కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మలుగు రూరల్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఘనంగా రంగోలి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీ నిర్వహించి బహుమతులను అందజేశారు. ప్రిన్సిపాల్ మల్లేశం, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఉదయశ్రీ, అనిల్ కుమార్ అ ధ్యాపకులు బాల య్య, కవిత, శిరీష, రాధిక, ఉదయశ్రీ, పాల్గొన్నారు.
పాఠశాలల్లో సంక్రాంతి సంబురాలు
పాఠశాలల్లో సంక్రాంతి సంబురాలు
పాఠశాలల్లో సంక్రాంతి సంబురాలు
పాఠశాలల్లో సంక్రాంతి సంబురాలు
పాఠశాలల్లో సంక్రాంతి సంబురాలు


