మేడారంలో ‘హలాల్‌’ను నిషేధించాలి | - | Sakshi
Sakshi News home page

మేడారంలో ‘హలాల్‌’ను నిషేధించాలి

Jan 10 2026 9:28 AM | Updated on Jan 10 2026 9:28 AM

మేడార

మేడారంలో ‘హలాల్‌’ను నిషేధించాలి

ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం జాతరలో హలాల్‌ విధానాన్ని నిషేధించాలని వనవాసీ కల్యాణ పరిషత్‌ జిల్లా కార్యదర్శి డాక్టర్‌ మైపతి సంతోష్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లిస్తూ సంప్రదాయబద్దంగా కోళ్లు, యాటలను దేవతలకు సమర్పిస్తారన్నారు. గిరిజన సంప్రదాయాలకు విరుద్ధంగా మేడారం జాతరలో దుకా ణాలను ఏర్పాటు చేసుకుని కోళ్లు, మేకలను హలాల్‌ పద్ధతితో కోయడం జరుగుతుందన్నా రు. ఈ విధానం గిరిజన సంప్రదాయాలకు అనుకూలం కాదని దీంతో గిరిజన సంస్కృతికి భంగం కలుగుతుందని తెలిపారు. జాతరలో ఈవిధానాన్ని తక్షణమే నిషేధించి దుకాణా లను తొలగించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి గిరిజన సంస్కృతి, పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

వనదేవతలను దర్శించుకున్న వాసుదేవరావు

ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మలను బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు శుక్రవారం దర్శించుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుతో కలిసి ఆయన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. తల్లుల కరుణ కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరికీ, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పెండింగ్‌ డీఏలను

విడుదల చేయాలి

వాజేడు : బకాయి ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని పీఆర్‌టీయూ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం ఎంఈఓ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా పీఆర్‌టీయూ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. రాజేష్‌, బాలాజీ, ప్రభాకర్‌, రాజ్యలక్ష్మి, శ్రీకాంత్‌, రాజెష్‌, ఆనంద్‌, కుమార్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

ఏటూరునాగారం: నేతకాని కులసంఘం రాష్ట్ర నాయకుడు గోగు మల్లయ్య అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను నేతకాని కుల సంఘం జిల్లా నాయకులు పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జాడి రాంబాబు మాట్లాడుతూ సంఘం కోసం మల్లయ్య చేసిన సేవలు మరువలేనివి అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లయ్య, నారాయణ, అర్జున్‌, లక్ష్మికాంత్‌, నర్సింహరావు, పోషయ్య తదితరులు పాల్గొన్నారు.

నేతకాని కులస్తులకు ఏజెన్సీ హక్కులు కల్పించాలి

వెంకటాపురం(కె): నేతకాని కులస్తులకు ఏజెన్సీ హక్కులు కల్పించాలని తెలంగాణ నేతకాని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జాడీ ఈశ్వర్‌ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో నేతకాని కులస్తుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతకాని కులస్తులకు సాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని అన్నారు. సమస్యలు ప రిష్కరించాలని కోరుతూ ఈ నెల 12న ము లుగు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మేడారంలో  ‘హలాల్‌’ను నిషేధించాలి
1
1/3

మేడారంలో ‘హలాల్‌’ను నిషేధించాలి

మేడారంలో  ‘హలాల్‌’ను నిషేధించాలి
2
2/3

మేడారంలో ‘హలాల్‌’ను నిషేధించాలి

మేడారంలో  ‘హలాల్‌’ను నిషేధించాలి
3
3/3

మేడారంలో ‘హలాల్‌’ను నిషేధించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement