కోతకు గురైన రోడ్డు
మంగపేట : మండలంలోని రాజుపేట, బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డు కప్పవాగు మలుపు వద్ద ప్రమాదం పొంచి ఉంది. 2023–04 వర్షాకాలంలో అతిభారీ వ ర్షాల కారణంగా వరదలు ఏటూరునాగారం–బూ ర్గంపాడు ప్రధాన రోడ్డుపై నుంచి పారడంతో సుమారు 30 మీటర్ల వరకు రోడ్డు కోతకు గురైంది. ఏళ్లు గడుస్తున్నా ఆర్ అండ్‌బీ అధికారులు నేటి వ రకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో అ త్యంత ప్రమాదకరంగా తయారైంది. పగలు, ర్రాతి తేడా లేకుండా నిత్యం వందలాది ఇసుక లారీలు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల రాక పో కలతో రోడ్డు రద్దీగా ఉంటుంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో సుమారు పదికి పైగా ప్రమాదాలు చోటు చే సుకున్నాయి. ఆయా సంఘటనల్లో నలుగురికి పైగా మృతి చెందగా పది మందికి పైగా తీవ్రంగా గాయపడి నడవలేని స్థితిలో న్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు మంచానికి పరిమితం కావడంతో వారిపై ఆధార పడిన కుటుంబాల పరిస్థితి అ త్యంత దయనీయంగా మారిందన్నారు. ఏడాది కోసారి రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తూ నీతులు వల్లించకుండా ప్రమాదకరంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరుగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి మేడారం జారతకు వెళ్లే వచ్చే భక్తుల వాహనాలు ఇదే రోడ్డుపై నుంచి వెళ్తుంటాయి. అధికారులు స్పందించి ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా రో డ్డు కు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పొంచి ఉన్న ప్రమాదం
మరమ్మతు చేయని అధికారులు
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు


