టెట్‌నుంచి మినహాయింపు ఇవ్వాలి
ములుగు రూరల్ : ఇన్ సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు శిరుప సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాఠశాల వద్ద నల్లబ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపారు. 317 జీఓ ఉత్తర్వులను సమీక్షించి ఉపాధ్యాయులకు ఉద్యోగ స్థానికతను కల్పించుట కోసం ఫిబ్రవరి 5న ఢిల్లీలో జరిగే ధర్నాకు సంఘీభావంగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
వాజేడు : సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధన పట్ల పునరాలోచన చేయాలని తెలంగాణ ఆదివాసీ టీచర్స్ ములుగు జిల్లా అధ్యక్షుడు తోలెం చిరంజీవి కోరారు. స్థానిక ఉన్నత పాఠ శాల ఆవరణలో శుక్రవారం ఎంఈఓ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఏటీఏ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాలాజీ, జనార్ధన్, రాంబూపతి, కవిత, విష్ణుప్రియ, పీఆర్‌టీయూ నాయకులు ప్రభాకర్, శ్రీరంగం తదితరులున్నారు.
కన్నాయిగూడెం : ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం గూర్రేవుల జెడ్పీఎస్‌ఎస్ ఉపాధ్యాయులు న్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
టెట్‌నుంచి మినహాయింపు ఇవ్వాలి
టెట్‌నుంచి మినహాయింపు ఇవ్వాలి


