విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
వెంకటాపురం(ఎం): స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలోని 40 మంది విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థి, హైదరాబాద్ ఇంటిలిజెన్స్ ఎస్పీ దండుగూడి రమేశ్ స్టడీ మెటీరియల్‌ను అందించగా పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. తాను చదివిన ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతను అందించేందుకు 40 మందికి స్టడీ మెటీరియల్ పాఠశాలకు పంపించారు. ఎంఈఓ ప్రభాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను అందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డుకాకూడదని కష్టపడకుండా ఇష్టంతో చదువుకొని చదువులో బాగా రాణించి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రాధిక, ఫరినా బేగం, పాల్గొన్నారు.
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు నిర్వహించుకున్నా రు. ఈ డీఈఓగా శ్రీజ, హెచ్‌ఎంగా వర్షిణి, ఉపాధ్యాయులుగా జయశ్రీ, అంజలి, హేమశ్రీ, అవంతి క, హారిక, రోహిణి, శృతి, స్వాతి, అలేఖ్య, రంజిత్, ప్రత్యూష, రాకేష్, ఎల్లస్వామి, పీడీగా ప్రణయ్‌లు వ్యవహరించారు.


