క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి
ఏటూరునాగారం/మంగపేట/వాజేడు : క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎంఈఓలు కోయడ మల్లయ్య, వెంకటేశ్వర్లు, పోదెం మేనక అన్నారు. శుక్రవారం ఆయా మండల కేంద్రాల్లో సీ ఎం కప్ 2026 టార్చ్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల ద్వారానే శారీరక దారుఢ్యం పెంపొందుతుందని అన్నారు. ఈ నెల 17 వరకు సీఎం కప్‌పై ర్యాలీ నిర్వహించి అనంతరం మండల స్థాయి పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని మండలానికి పేరు తీసుకు రావాలని వారు కోరారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ కోచ్ ఎండీ హుస్సేన్, సతీష్, ఎస్సై రాజ్ కుమార్‌చ హెచ్‌ఎం సాంబశివరావు, క్లస్టర్ ఇన్‌చార్జ్ పద్మశ్రీ, మున్వర్, స్వరూప తదితరులు పాల్గొన్నారు. మంగపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆమె మండలంలోని వ్యాయామ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులతో కలిసి సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు శ్రీనివాస్, నాగేందర్, వెంకటేశ్వ ర్లు, నరేష్, శ్యాంప్రసాద్, సుజాత పాల్గొన్నారు.


