డ్రైవర్లకు ఉచిత కంటి వైద్యశిబిరం
ములుగు: రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ములుగు డీటీఓ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఈఐబీ, ఆటో, టాటా మ్యాజిక్, లారీ డ్రైవర్లకు నిపుణులైన వైద్యులచే కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్‌టీఓ శ్రీని వాస్ మాట్లాడారు. వాహనాలు నడిపే డ్రైవర్లకు కంటి ఆరోగ్యం ఎంతో కీలకమైందని, రోడ్డు ప్రమాదా లను నివారించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. అనంతరం వెంకటాపూర్ మండల కేంద్రంలోని జోహార్ పాఠశాల విద్యార్థులచే పాదచారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించా రు. రోడ్డు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, పాదచారుల భద్రత వంటి అంశాలపై వివరంగా అవగా హన కల్పించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం అబ్దుల్ జావీద్, పాల్గొన్నారు.


