యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి
మంగపేట: నేటి యువత వ్యసనాలకు దూరంగా ఉండి సమాజానికి దోహదపడే విధంగా సామాజిక చైతన్య కార్యక్రమాల్లో ముందుకు సాగాలని యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కుంజ సూర్య అన్నారు. మండలంలోని రాజుపేటలో అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడాపోటీలను ఆయన శుక్రవారం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పానీయాలు, గంజాయి వంటి పదార్థాలకు బానిస కావొద్దన్నారు. ప్రతీ క్రీడాకారుడు ఓటమి గెలుపునకు నాంది అనే స్ఫూర్తితో స్నేహపూర్వకంగా పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను చాటి ఇతర క్రీడా కారులకు ఆదర్శంగా నిలువాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ కర్రి నాగేంద్రబాబు మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.


