వనదేవతలకు.. మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో సుందరీకరణ పనుల్లో భాగంగా స్కేపింగ్ ల్యాండ్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ జీవన శైలి, ఆదివాసీల సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్నాయి. రైతులు, ఎద్దులు, అడవి జంతువుల రూపాలతో మేడారం జాతర ఆత్మను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు గురువారం భారీగా తరలివచ్చారు. సమ్మక్క రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. జంపన్నవాగులోని షెవర్ల కింద పుణ్యస్నానాలు ఆచరించి.. అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పోలీసులు భక్తులను క్రమపద్ధతిలో సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడ్దిరాజుల గద్దెలను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని కుటుంబ సమేతంగా భోజనలు ఆరగించారు.
వనదేవతలకు.. మొక్కులు
వనదేవతలకు.. మొక్కులు
వనదేవతలకు.. మొక్కులు


