క్రీడా ప్రతిభకు సీఎం కప్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

క్రీడా ప్రతిభకు సీఎం కప్‌ పోటీలు

Jan 9 2026 7:34 AM | Updated on Jan 9 2026 7:34 AM

క్రీడా ప్రతిభకు సీఎం కప్‌ పోటీలు

క్రీడా ప్రతిభకు సీఎం కప్‌ పోటీలు

ములుగు: యువత తమ క్రీడా ప్రతిభను కనబర్చడానికి సీఎం కప్‌ పోటీలు సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నాయని కలెక్టర్‌ టీఎస్‌.దివాకర పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సీఎం కప్‌ రెండో ఎడిషన్‌ టార్చ్‌ ర్యాలీని కలెక్టర్‌ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామీణస్థాయి క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి సీఎం కప్‌ రెండో ఎడిషన్‌ సరైన వేదికని తెలిపారు. ఈ క్రీడాపోటీలు రేపటి వరకు టార్చ్‌ ర్యాలీలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. 8న ములుగు జిల్లా కలెక్టరేట్‌లో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, మల్లంపల్లి జెడ్పీఎస్‌ఎస్‌లో 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, వెంకటాపురం(ఎం) జెడ్పీహెచ్‌ఎస్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు, గోవిందరావుపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు, 9న ఐటీడీఏ కార్యాలయంలో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, మంగపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తాడ్వాయి పాఠశాలలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, 10న ముప్పనపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, వాజేడు జెడ్పీహెచ్‌ఎస్‌లో 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, వెంకటాపురం(కె) జెడ్పీహెచ్‌ఎస్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3గంటల వరకు టార్చ్‌ ర్యాలీ కొనసాగనుందని వెల్లడించారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 44 రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామస్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయిలో, ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు నియోజకవర్గస్థాయిలో, 10 నుంచి 14వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, 19 నుంచి 26 వరకు రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి సర్ధార్‌ సింగ్‌, డీఈఓ సిద్ధార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ టీఎస్‌.దివాకర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement