మేడారంలో ప్లాస్టిక్‌కు నో..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఎకో ఫ్రెండ్లి సమ్మక్క– సారలమ్మ జాతర నిర్వహణకు ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు గురువారం మేడారంలో వినూత్న ప్రచారం నిర్వహించారు. ప్లాస్టిక్‌కు నో చెప్పండి నినాదంతో భక్తులకు, వ్యాపారులకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఎకో క్లబ్ కన్వీనర్ డాక్టర్ సరిత, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అనిల్‌కుమార్, డాక్టర్ ఉదయశ్రీల ఆధ్వర్యంలో పెక్ల్సీలు ఏర్పాటు చేసి కరప్రతాలను పంపిణీ చేశారు. కాగితపు క్లాత్ సంచులు వాడాలని వ్యాపారులకు సూచించారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే పర్యావరణ, ఆరోగ్య నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బాలయ్య, అధ్యాపకులు, వలంటీర్లు పాల్గొన్నారు.
ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల ప్రచారం


