యువత మత్తుకు దూరంగా ఉండాలి
ములుగు: యువత మత్తు పదార్దాలకు దూరంగా ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్‌న్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అధ్యర్యంలో నేషనల్ యూత్ డే ప్రోగ్రాంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. యువత కష్టపడి చదివి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. మోటార్ వెహికల్ చట్టం, పోక్సో చట్టం గురించి వివరించారు. ఉచిత న్యాయ సహాయానికి టోల్ ఫ్రీ నంబర్ 15100కి కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం, వైస్ ప్రిన్సిపాల్ బాలయ్య, యాంటీ డ్రగ్స్ కమిటీ కన్వీనర్ అనిల్ కుమార్, ప్రొఫెషర్ ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.


