వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
● భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్
వాజేడు : కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావ్ తెలిపారు. మండల పరిధిలోని పెద్దగొళ్లగూడెం గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆయన సమక్షంలో బుధవారం పది కుటుంబాలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో 37మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ విజయ, ఆర్‌ఐ కుమారస్వామి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్, నాయకులు దంతులూరి విశ్వనాథప్రసాద రాజు, జగన్నాథరాజు, అల్లి నాగేశ్వరావు, విజయ్ ఉన్నారు.
ఏటూరునాగారం : మండల కేంద్రంలోని కొమురం భీమ్ స్టేడియంలో నిర్వహిస్తున్న క్రీడాకారులకు ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే వైద్యసేవలను అందించేందుకు సిబ్బంది, వైద్యులు అందుబాటులో ఉన్నట్లు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్ తెలిపారు. బుధవారం క్రీడా మైదానంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయగా ఆయన పరిశీలించి మాట్లాడారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అలాగే ఎమర్జెన్సీ సేవలు కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైద్యురాలు సుమలత, గిరి, ఫార్మాసిస్ట్ స్వామి, సుగుణావతి, ధనలక్ష్మి, ఖలీల్, ఈఎంటీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
వాతావరణం


