రోడ్డు భద్రత అందరి కర్తవ్యం
ఏటూరునాగారం: రోడ్డు భద్రత అందరి కర్తవ్యమని జిల్లా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వినోద్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో బుధవారం రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినోద్‌రెడ్డి హాజరై మాట్లాడారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. వాహనదారులు మద్యం సేవించి నడపరాదని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ డైరెక్టర్ వసంత శ్రీనివాస్, డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్ రేణుక, స్థానిక సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సీహెచ్.వెంకటయ్య, జ్యోతి, ఫాతిమా, సంపత్, రమేశ్, భాస్కర్ పాల్గొన్నారు.
జిల్లా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్
వినోద్‌రెడ్డి


