ఈసారి గిరిజన గ్రామం లేనట్టేనా?
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని ఆదివాసీ మ్యూజియంలో ఈసారి కోయ గిరిజన గ్రామ ఏర్పాటు లేనట్లుగానే కనిపిస్తుంది. ఆదివాసీ మ్యూజియం నిర్మించిన నాటి నుంచి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలు జాతరకు వచ్చే భక్తులు తెలిసేలా మ్యూజియంలో మోడల్ కోయ గిరిజన గ్రామాన్ని ఏర్పాటు చేశారు. వెదురుతో గుడిసెలు నిర్మించి పైకప్పు గడ్డితో ఏర్పాటు చేసి మట్టితో గోడలు ఏర్పాటు చేసి ముగ్గులతో అందంగా అలకరించే వారు. కాని ఈ సారి జాతరలో కోయ గిరిజన గ్రామం ఏర్పాటుపై గిరిజన సంక్షేమశాఖ అధికారులు పక్కనబెట్టడంపై ఆదివాసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


