పిల్లర్ వంకరగా..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో భక్తుల క్యూలైన్ల కోసం నిర్మిస్తున్న జీఐ షెడ్ల నిర్మాణంలో నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి. పిల్లర్ల దిమ్మలు పైన ఒకలాగా కింద ఒకలాగా వంకరగా ఒరిగి పోయినట్లు కనిపిస్తుండడంతో పనుల నాణ్యత ప్రమాణాల తీరుపై తీవ్ర విమర్శలు తలెతుత్తున్నాయి. పనుల ప్రాథమిక దశలోనే లోపాలు కనిపిస్తే షెడ్ల నిర్మాణంలో మరెన్ని లోపాలు ఉంటాయోనని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జాతర సమీపిస్తున్న వేళ హడావుడిగా పనులు చేయడంతోనే లోపాలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పిల్లర్ వంకరగా..


