అభివృద్ధి పనులేవి?
కొండాయిలోని గోవిందరాజు ఆలయంపై చిన్నచూపు
కొండాయిలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద అధ్వానంగా ఉన్న ప్లోరింగ్
మల్యాలలో సమ్మక్క గుడికి రంగులు వేస్తూ..
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతరకు మరో 21 రోజుల సమయం మాత్రమే ఉంది. కొండాయిలో కొలువై ఉన్న సమ్మక్క మరిది గోవిందరాజుల ఆలయంపై అధికారులకు చిన్నచూపు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆలయానికి రంగులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. జాతర సమీపిస్తున్నప్పటికీ అభివృద్ది పనులు మొదలుపెట్టకపోవడంపై ఆదివాసీలు మండిపడుతున్నారు. మేడారం జాతర సమీపిస్తున్నా అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆలయం చుట్టూ గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. గోవిందరాజులను మేడారం జాతర సమయంలో సారలమ్మ వచ్చే రోజునే గద్దెలపైకి తీసుకెళ్లడం ఆనవాయితీ. జాతర సమయం దగ్గరపడుతుందని హడావుడి పనులు చేయడం అధికారులకు పరిపాటిగా మారిందని భక్తులు వాపోతున్నారు.
దెబ్బతిన్న ఫ్లోరింగ్, పగిలిపోయిన నాపరాయి
కొండాయిలో గల సమ్మక్క,– సారలమ్మ గద్దెల వద్ద ఫ్లోరింగ్ పనులు మొదలు కాలేదు. మేడారం జాతర సమయంలో జాతరకు వెళ్లే భక్తులు ఎడ్లబండ్లు, ప్రైవేట్ వాహనాల్లో ఇక్కడకు వచ్చి గద్దెలను దర్శించుకొని పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఫ్లోరింగ్, నాపరాయి పగిలిపోయి అధ్వానంగా మారింది. భక్తుల సౌకర్యార్ధం మరమ్మతులు చేయాల్సిన ఎండోమెంట్, ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు వాటిపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు.
మల్యాలలో రంగుల పనులు
మల్యాలలో కొలువైన సమ్మక్క గుడికి రంగులు వేస్తున్నారు. మేడారం జాతర సమయంలో గోవిందరాజుల పూజారులు పడిగెతో ఇక్కడికి చేరుకుని ఆతిఽథ్యం స్వీకరించి మేడారానికి బయలుదేరుతారు. ఇందుకోసం సమ్మక్క గుడిని రంగులతో ముస్తాబు చేస్తున్నారు.
సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద దెబ్బతిన్న ఫ్లోరింగ్
జాతర సమీపిస్తున్నా
పట్టించుకోని అధికారులు
అభివృద్ధి పనులేవి?
అభివృద్ధి పనులేవి?


