నేడు, రేపు ఉమ్మడి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర
హన్మకొండ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు గురు, శుక్రవారాలు రెండు రోజుల పాటు హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర శాఖ పర్యటన వివరాలు విడుదల చేసింది. గురువారం ఉదయం 10 గంటలకు కాజీపేటలో ఘనస్వాగతం అనంతరం ర్యాలీగా భద్రకాళి దేవస్థానానికి చేరుకుంటారు. అమ్మవారి దర్శనం అనంతరం హనుమకొండ హంటర్ రోడ్‌లోని వేద బాంక్వెట్ హాల్‌కు చేరుకుని ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతారు. అనంతరం ఇక్కడ జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్‌లో ర్యాలీ అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరునుంచి ర్యాలీగా జిల్లాకేంద్రానికి చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. రాత్రి గుడెప్పాడ్‌లోని ఓ హోటల్‌లో బస చేస్తారు. 9న ఉదయం 9 గంటలకు ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు. 10.30కు మేడారం చేరుకుని సమక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కలు చెల్లిస్తారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. మీడియాతో మాట్లాడిన అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.
ములుగు రూరల్: ఎన్నికల నియమావళిని పారదర్శకంగా అమలు చేయాలని కోరుతూ బుధవారం మున్సిపల్ కమిషనర్ సంపత్‌కు బీఆర్‌ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు రవితేజ మాట్లాడుతూ ఒకే వ్యక్తి ఒకే ఓటు ఉండే విధంగా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీలో కూడా ఓటుహక్కు కలిగి ఉన్న ఓటర్ల పేర్లను సరిచేయాలన్నారు. కుటుంబ సభ్యులను యూనిట్‌గా తీసుకుని తుది ఓటరు జాబితా ప్రకటించాలని కోరారు. జాబితా వివరాలను మున్సిపాలిటీ కార్యాలయంతో పాటు బండారుపల్లి, జీవింతరావుపల్లిలో ప్రదర్శించాలని కోరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ములుగు రూరల్ : బైక్‌ను టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఇంచర్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 53 మంది విద్యార్థులు జిల్లాలోని రామప్ప, లక్నవరం పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ అజాగ్రత్త.. అతివేగం వల్ల అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. బస్సు ప్రమాదానికి గురికావడంతో విద్యార్థినులు భయందోళనకు గురయ్యారు. ప్రైవేటు వాహనాల్లో విహార యాత్రలకు తీసుకొచ్చినప్పుడు యాజమాన్యాలు జాగ్రత్తలు వహించాలని గ్రామస్తులు.. ఉపాధ్యాయులను, డ్రైవర్‌ను మందలించారు.
మల్హర్ (కాటారం): చిన్న కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చిన్న కాల్వల నిర్మాణానికి చేపట్టే భూ సేకరణ నిమిత్తం మండలంలోని దామెరకుంట గ్రామంలో బుధవారం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రమేశ్ ఆధ్వర్యంలో భూ సేకరణ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా దామెరకుంట గ్రామ పంచాయతీ ఆవరణలో 6.02 ఎకరాలు, మల్లారంలో 17.15, గూడురులో 6.01 ఎకరాలు, జాదరావుపేటలో 5.04 ఎకరాలు మొత్తం దామెరకుంట క్లస్టర్ పరిధిలోని 34.22 ఎకరాల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతుల పేర్లును తహసీల్దార్ నాగరాజు గ్రామసభలో చదవి వినిపించారు. అలాగే పలువురి రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరించారు.
నేడు, రేపు ఉమ్మడి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర
నేడు, రేపు ఉమ్మడి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర


