సమస్యల పరిష్కారానికి కృషి
ఏటూరునాగారం: గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో పీఓ గిరిజనుల నుంచి 8 వినతులను స్వీకరించారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘానికి మేడారం జాతరలో నాలుగు కోళ్ల షాపులు, 200ల టీషర్టులు, 50 వీఐపీ పాస్‌లు, 50 వీవీఐపీ పాస్‌లు ఇవ్వాలని పీఓకు విన్నవించారు. ఆదివాసీ రైతుసంఘం సభ్యులు మంగపేట మండలానికి 50 మందికి టీషర్టులు, బెల్లం, కొబ్బరి షాపులు ఇప్పించాలని కోరారు. మహబూబాబాద్ జిల్లాలోని మదగూడెం గ్రామానికి చెందిన ఓ గిరిజనుడు ట్రైబల్ రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం ఇప్పించాలని కోరారు. కన్నాయిగూడెం మండలం రాయినిగూడెంలో సాగు భూములకు 10 హెచ్‌పీ మోటార్లు, పైపులైన్ ద్వారా నీరు అందించాలని విన్నవించారు. మంగపేట మండలం గంపోనిగూడెంకు చెందిన ఓ గిరిజన మహిళా నా భర్త 2022లో మరణించారని, పేద కుటుంబం కావడంతో కుటుంబం గడవడం లేదని ఉపాధి కల్పించాలని అధికారులను వేడుకుంది. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేశ్ బాబు, మేనేజర్ శ్రీనివాస్, జేడీఎం కొండల్‌రావు, ప్రోగ్రాం అధికారి మహేందర్, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, జియాలజిస్ట్ ఆలెం కిశోర్, ఐటీడీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
గిరిజనదర్బార్‌లో వినతులు స్వీకరించిన పీఓ


