సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శం
● మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కల్యాణి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: బాలికల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి పూలేను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కొయ్యడ మల్లయ్య అధ్యక్షతన సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలను జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేగ కల్యాణి హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. బాలికల అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని తెలిపారు. బాలికలు చదువుకునేందుకు పాఠశాలలను స్థాపించారని ఆమె సేవలను కొనియాడారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి చెంచయ్య మాట్లాడుతూ విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథం పెంపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలను అందించిన 20 మంది మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సూర్యనారాయణ, ఏఎంఓ శ్యాంసుందర్‌రెడ్డి, ఎంఈఓ గడ్డి శ్రీనివాస్, పీజీ హెచ్‌ఎంలు బద్దం లక్ష్మారెడ్డి, రేవతి, నాయకులు వాసుదేవరెడ్డి, వెంకటస్వామి, బాబురావు, డీటీఎఫ్ నాయకులు రేగ నరేందర్, కేజీబీవీ స్పెషలాఫీసర్ పుష్పనీల పాల్గొన్నారు.


