జాతరలో మెరుగైన వైద్యసేవలు
ములుగు రూరల్: మేడారం మహాజాతరలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతరలో మెడికల్ క్యాంపుల ఏర్పాటు, మందుల పంపిణీ నిర్వహణకు అధికారులను నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య సూత్రాలు, జాతీయ ఆరో గ్య కార్యక్రమాల ప్రచారానికి మాస్ మీడియా వి భాగం, కర పత్రాలు, ఆరోగ్య ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విపిన్‌కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, రణధీర్, డెమో సంపత్, సూపరింటెండెంట్ విజయభాస్కర్, గణేశ్, వినోద్, హిమ, కిరణ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు


