ఘనంగా క్రిస్మస్ వేడుకలు
– మరిన్ని ఫొటోలు 9లోu
చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, దుస్తుల పంపిణీ
ములుగు రూరల్: జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు బుధవారం రాత్రి, గురువారం ఘనంగా జరుపుకున్నారు. క్రిస్టియన్లు చర్చిలకు చేరుకుని కేక్‌లు కట్‌చేసి పంచుకున్నారు. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రీస్తుమార్గం అనుసరణీయమని బోధించారు. పలు చర్చిల్లో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. జగ్గన్నపేట పంచాయతీ పరిధిలోని చిన్నగుంటూరుపల్లి చర్చిలో నిర్వహించిన వేడుకల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చర్చి పాస్టర్‌తో కలిసి కేక్‌కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చర్చి అభివృద్ధికి మంత్రి సీతక్క ఆదేశాల మేరకు రూ. 10 వేలు ఆర్థిక సాయంగా అందజేసినట్లు తెలిపారు.
ఘనంగా క్రిస్మస్ వేడుకలు


