‘దుప్పట్లను సద్వినియోగం చేసుకోవాలి’ | - | Sakshi
Sakshi News home page

‘దుప్పట్లను సద్వినియోగం చేసుకోవాలి’

Dec 26 2025 8:15 AM | Updated on Dec 26 2025 8:15 AM

‘దుప్

‘దుప్పట్లను సద్వినియోగం చేసుకోవాలి’

‘దుప్పట్లను సద్వినియోగం చేసుకోవాలి’ జాతర పోస్టర్‌ ఆవిష్కరణ మంత్రి శ్రీధర్‌బాబు చిత్రపటానికి పాలాభిషేకం అయ్యప్ప స్వాములకు భిక్ష

ఎస్‌ఎస్‌తాడ్వాయి: చలి తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు పంపిణీ చేసిన దుప్పట్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి అన్నారు. మేడారంలో సర్పంచ్‌ భారతితో కలిసి ఆమె గురువారం వృద్ధులు, కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కల్యాణి మాట్లాడుతూ చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మంత్రి సీతక్క సూచనల మేరకు దప్పట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్‌, మండల గౌరవ అధ్యక్షుడు జలాపు అనంతరెడ్డి, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ పులి సంపత్‌, ఎస్టీ సెల్‌ జిల్లా కార్యదర్శి పిరీళ్ల వెంకన్న, మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు, గ్రామ కమిటీ అధ్యక్షుడు గడిగ అనిల్‌, పూజారులు జనార్ధన్‌, దశరథం, భోజరావు పాల్గొన్నారు.

భూపాలపల్లి రూరల్‌: నేడు (శుక్రవారం) మెదక్‌ జిల్లాలో జరిగే కేవల్‌ కిషన్‌ ముదిరాజ్‌ జాతర పోస్టర్‌ను ముదిరాజ్‌ మహాసభ జిల్లా అధ్యక్షులు జోరుక సదయ్య ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో ఆవిష్కరించారు. బలహీన వర్గాలకు ఎన్నో సేవలు అందించిన ఇలాంటి మహనీయుడిని స్మరించుకోవడం సమాజంలోని ప్రతీ ఒక్కరి కర్తవ్యం అన్నారు. భవిష్యత్‌ తరాలకు వీరి చరిత్ర తెలియజేయాలన్నారు. జాతరకు ముదిరాజ్‌ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాసభ నాయకులు చాడ కృష్ణస్వామి, వేముల రాజమౌళి, చిలకలపాణి, కొలిపాక మల్లయ్య, బోయిని సాంబయ్య, వెంగళ ఆంజనేయులు పాల్గొన్నారు.

కాటారం: దామెరకుంట మానేరుపై వంతెన నిర్మాణంతో పాటు పలు రోడ్ల నిర్మాణం కోసం మంత్రి శ్రీధర్‌బాబు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించడాన్ని హర్షిస్తూ మండలకేంద్రంలోని ప్రధాన కూడలిలో గురువారం కాంగ్రెస్‌ శ్రేణులు మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దామెరకుంట మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.203 కోట్లు, కాటారం నుంచి సబ్‌స్టేషన్‌పల్లి వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.3 కోట్లు, సుబ్బయ్యపల్లి నుంచి ప్రతాపగిరి వరకు రూ.3.50కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణం కోసం మంత్రి శ్రీధర్‌బాబు నిధులు మంజూరు చేయించారని తెలిపారు. మంథని నియోజకవర్గంతో పాటు కాటారం మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మంత్రి ముందుకు వెళ్తున్నట్లు కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు.

భూపాలపల్లి రూరల్‌: పట్టణంలోని మంజూర్‌నగర్‌లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం అయ్యప్పస్వాములకు మహా అన్న ప్రసాదం(భిక్ష) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు.–పద్మ దంపతులు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వాములు, భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

‘దుప్పట్లను సద్వినియోగం చేసుకోవాలి’
1
1/2

‘దుప్పట్లను సద్వినియోగం చేసుకోవాలి’

‘దుప్పట్లను సద్వినియోగం చేసుకోవాలి’
2
2/2

‘దుప్పట్లను సద్వినియోగం చేసుకోవాలి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement