భక్తులకు అసౌకర్యం కలిగించొద్దు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించొద్దని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో మంత్రి సీతక్క మాట్లాడారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తునందున్న స్నాన ఘట్టాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కొంగలమడుగు నుంచి జంపన్నవాగు వరకు రోడ్ల మరమ్మతులు వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్నందున్న రోడ్ల విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గద్దెల ప్రాంగణం అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలన్నారు. అదనంగా కార్మికుల సంఖ్య పెంచి షిఫ్టుల వారీగా 24 గంటలు పనులు చేపట్టాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, పీఓ చిత్రామిశ్రా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి పాల్గొన్నారు.
జంపన్నవాగు, రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన
సమీక్ష కంటే ముందుగా మంత్రి సీతక్క అధికారులతో కలిసి జంపన్నవాగులో ఏర్పాట్లు, వీవీఐపీ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించారు. శివరాంసాగర్ చెరువును పరిశీలించి జాతర సమయంలో చెరువులో స్నానాలు చేసే విధంగా నీటిని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గద్దెల ప్రాంగణంలో ప్రాకారం పనులను కూడా సీతక్క పరిశీలించి పనులు జెట్‌స్పీడుగా చేయాలని ఆదేశించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
మంత్రి సీతక్క
భక్తులకు అసౌకర్యం కలిగించొద్దు


