
పడవల రాకపోకలు నిలిపివేత
ఏటూరునాగారం మండలంలోని కొండాయి వద్ద జంపన్నవాగు ఉధృతంగా ప్రవహించడంతో పడవలను నిలిపివేశారు. వరద ఉధృతి తగ్గే వరకు పడవలను నడపొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో పక్కన బెట్టారు. అలాగే ఎలిశెట్టిపల్లి వద్ద కూడా జంపన్నవాగు ఉధృతంగా ఉండడంతో పడవలను అత్యవసరం మేరకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఎలిశెట్టిపల్లి గ్రామంలో శానిటేషన్ పనులు చేయడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. క్లోరినేషన్, బ్లీచింగ్ చల్లించి ప్రజలు రోగాల బారిన పడకుండా ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే గోదావరి ఉధృతికి రామన్నగూడెం వద్ద ఒడ్డు కోతకు గురై మట్టి తరలిపోతుంది.