‘చలో వరంగల్ విజయవంతం చేయాలి’
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మంద కృష్ణమాదిగ పద్మశ్రీ అవార్డు అందుకుని ఢిల్లీ నుంచి ఈనెల 31 న వరగంల్‌కు వస్తున్నందున్న ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి కరుణాకర్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి శ్యాంబాబులు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు దుర్గారావు అధ్యక్షతన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల నాయకులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. మంద కృష్ణకు ఘనస్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామకృష్ణ మాట్లాడుతూ ఘన స్వాగతం అనంతరం అదే రోజున వరంగల్‌లో ఎమ్మారీఎస్, అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లూరి లక్ష్మణ్, నరేశ్, పురుషోత్తం సాంబయ్య, నాగరాజు, కరుణాకర్, నవీన్, అనిల్, సురేష్ పాల్గొన్నారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ట్రైనీ ఎస్సై రచిత్ర మంగళవారం తెలిపారు. పక్కా సమాచారం మేరకు సోమవారం రాత్రి పేకాట ఆడుతున్న నాగరాజు, వెంకటేశ్వర్లు, వెంకన్న, సూర్యనారాయణ, బాలరాజులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.9,980లు నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వివరించారు.
ఘనంగా మాజీ ప్రధాని నెహ్రూ వర్ధంతి
ములుగు: మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతిని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజ సూర్య ముఖ్యఅతిథిగా హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి నెహ్రూ చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్సార్‌ఖాన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుమన్‌రెడ్డి, జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు మురుకుట్ల నరేందర్, నేపాల్‌రావు, సందీప్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
‘చలో వరంగల్ విజయవంతం చేయాలి’


