స్లాట్ బుకింగ్‌పై అవగాహన తప్పనిసరి
ములుగు: రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టే స్లాట్ బుకింగ్‌పై ప్రతీ ఒక్క దస్తావేజులేఖరులు అవగాహన తప్పనిసరి కలిగి ఉండాలని జిల్లా రిజిస్ట్రార్ ఫణిందర్ అన్నారు. ఈ మేరకు దస్తావేజులేఖరులకు శుక్రవారం ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయనకు వారు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫణిందర్ మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందన్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతిరోజూ 48 స్లాట్‌లకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతీస్లాట్ 10నిమిషాల్లో ఆన్‌లైన్‌లో పూర్తి చేయబడుతుందన్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు సబ్ రిజిస్ట్రార్ దిలీప్‌చంద్రగోపాల్, దస్తావేజులేఖరులు సూర్యదేవర విశ్వనాధ్, సాదు రఘు, ప్రవీణ్, రామకృష్ణ, భాస్కర్, హరినాధ్, రాజేశ్, సుజాత పాల్గొన్నారు.
జిల్లా రిజిస్ట్రార్ ఫణిందర్


