ప్రమాణస్వీకారానికి దూరంగా వార్డు సభ్యులు
వాజేడు: మండల పరిధిలోని చెరుకూరు గ్రామ పంచాయతీలో ఆరుగురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. సర్పంచ్ రాజబాబు, ఉప సర్పంచ్ అట్టం శివ కృష్ణతో పాటు వార్డు సభ్యురాలు సులోచన మాత్రమే సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఆరుగురు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆలస్యంగా రావడంతో పాటు తాము ప్రమాణ స్వీకారం చేయమని అధికారులకు తెలిపారు. తమ వర్గానికి ఉపసర్పంచ్ పదవిని ఇస్తామని హామీనిచ్చి ఇప్పుడు మరొకరికి ఇవ్వడం సరికాదని ప్రశ్నించారు. ఉప సర్పంచ్ పదవి ఇస్తేనే తాము ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపి అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఆరుగురు వార్డు సభ్యులు కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు చేయడానికి వెళ్లినట్లు సమాచారం.


