వినతుల పరిష్కారమే లక్ష్యం
ములుగు రూరల్: ప్రజావాణి వినతుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని అదనపు కలెక్టర్ మహేందర్‌జీ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి దరఖాస్తులను అదనపు కలెక్టర్ ఆర్డీఓ వెంకటేశ్‌తో కలిసి స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గతంలో అందించిన దరఖాస్తుల పరిష్కారంలోని చొరవ చూపాలని సూచించారు. ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు హాజరై శాఖల వారీగా దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు.
35 అర్జీల రాక
ప్రజావాణిలో వివిధ సమస్యలపై 35 దరఖాస్తులను బాధితులు అందించారు. ఇందులో అత్యధికంగా భూ సమస్యలపై 8, గృహ నిర్మాణశాఖ 4, పింఛన్లు 6, ఇతర శాఖలకు సంబంధించిన 17 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శాఖల వారీగా దరఖాస్తులను బదలాయించినట్లు తెలిపారు.
అధికారులను ఆదేశించిన
అదనపు కలెక్టర్ మహేందర్‌జీ
ప్రజావాణిలో 35 అర్జీల స్వీకరణ


