పనులు త్వరగా పూర్తిచేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర గుత్తేదారులను ఆదేశించారు. గద్దెల ప్రాంగణంలోని ప్రహరీ చుట్టూ ఏర్పాటు చేస్తున్న రాతి స్తంభాల ఏర్పాటు పనులను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఆర్కిటెక్షర్ శివనాగిరెడ్డి రాతి స్తంభాల పైభాగంలో అమర్చే రాతి చిహ్నాల వివరాలను కలెక్టర్‌కు వివరించారు. రాతి స్తంభాల నిర్మాణంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


