పంచాయతీలకు కొత్త శోభ
రెండేళ్ల తర్వాత కళకళలాడిన గ్రామపంచాయతీలు
ములుగు/ములుగురూరల్: దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు.. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది. అలాంటి పల్లెలకు రెండేళ్ల తర్వాత రథ సారధులుగా సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయా పంచాయతీల్లో అట్టహాసంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీంతో గ్రామాల్లోని పంచాయతీలు నూతన శోభను సంతరించుకున్నాయి.
144 జీపీల్లో ప్రమాణస్వీకారం
జిల్లాలోని 9 మండలాల పరిధిలో గల 146 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా కొత్తగా ఎన్నికై న పాలకవర్గాలు సోమవారం ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నాయి. వాజేడు మండలంలోని పూసూరు సర్పంచ్ దబ్బకట్ల సుమన్, కన్నాయిగూడెం మండలంలోని రాజన్నపేట సర్పంచ్ పొడెం నర్సింహారావు పెసా సభలకు వైజాగ్ వెళ్లడంతో ఇద్దరి సర్పంచ్‌ల ప్రమాణస్వీకారం నిలిచిపోయింది. ఆయా గ్రామాల్లో ఉప సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. 144 గ్రామపంచాయతీల్లో మాత్రమే సర్పంచ్‌ల అధ్యక్షతన తొలి సమావేశం జరగగా మిగిలిన రెండు పంచాయతీల్లో సమావేశాన్ని నిర్వహించలేదు.
కొలువుదీరిన కొత్త సర్పంచ్‌లు
నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు ఆయా పంచాయతీల ప్రత్యేక అధికారుల సమక్షంలో సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేశారు. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టినట్లు రిజిస్టర్‌లో తొలి సంతకం చేశారు. అనంతరం వార్డు సభ్యులతో తొలి పంచాయతీ సమావేశాన్ని నిర్వహించి గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించారు. పాలకవర్గాల ప్రమాణస్వీకారం సందర్భంగా పంచాయతీలను అధికారులు అందంగా ముస్తాబు చేశారు. మంత్రి సీతక్క పీఏగా పనిచేసిన బొమ్మకంటి రమేశ్ తన సతీమణి వంశావతితో లక్ష్మీదేవిపేట సర్పంచ్‌గా నామినేషన్ వేయించి గెలుపొందడంతో లక్ష్మీదేవిపేటలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయించి నివాళులర్పించారు. అంబేడ్కర్, మంత్రి సీతక్క చిత్రపటాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
– మరిన్ని వార్తలు, ఫొటోలు 8,9లోu
బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు
146 పంచాయతీలకు 144 జీపీల్లో
తొలి సమావేశం


